Parvathy Thiruvothu : మలయాళ చలన చిత్ర పరిశ్రమలో వస్తున్న సినిమాలు డిఫరెంట్ గా ఉంటున్నాయి. ప్రత్యేకించి అద్భుతమైన ప్రతిభతో కూడిన నటీ నటులు, దర్శక, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు పుట్టుకు వస్తున్నారు. వారికి మద్దతు ఇవ్వడమే కాకుండా పెద్ద ఎత్తున ఆదరిస్తున్నారు. ఈ సందర్బంగా విడుదలైన కీలక వ్యాఖ్యలు చేశారు ప్రముఖ నటి పార్వతి తిరువోతు(Parvathy Thiruvothu). తను సహజ నటిగా గుర్తింపు పొందారు. ఈ సందర్బంగా తన సినీ కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Parvathy Thiruvothu Comment
తాజాగా తను నటించిన ఉల్లోజుక్కుల్లో చిత్రంలోని పాత్ర గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు పార్వతి తిరువోతు. అంజు పాత్రను జీవితంలో మరిచి పోలేనంటూ పేర్కొంది. దాని వల్ల తనకు సాధికారిత లభించిందని చెప్పింది. ఇందులో నటించినందుకు గాను 2025 క్రిటిక్స్ ఛాయిస్ అవార్డులో ఉత్తమ సహాయ నటి విభాగంలో నామినేట్ కావడం మరింత ఆనందాన్ని కలిగించిందని తెలిపింది. ఇది మరింత బాధ్యతను పెంచేలా చేసిందని పేర్కొంది.
ఈ సినిమా ద్వారా తాను నటనా పరంగా ఎన్నో నేర్చుకున్నానని చెప్పింది పార్వతి తిరువోతు. భావోద్వేగ సవాళ్లను ఎలా ఎదుర్కోవాలనే దాని గురించి తాను దర్శకుడు క్రిస్టో టామీ నుంచి నేర్చుకున్నానని వెల్లడించింది. సినిమా చేస్తున్న సమయంలో తాను అనారోగ్యానికి గురైనా, తనకు సపోర్ట్ గా నిలిచి, అద్భుతంగా తన పాత్ర వచ్చేలా చేసినందుకు తాను ఎల్లకాలం దర్శకుడికి రుణపడి ఉంటానని అన్నది.
Also Read : Dynamic Actor Mohan Lal :ఆసక్తి రేపుతున్న మోహన్ లాల్ ఎంపూరన్