Super Deluxe : కోలీవుడ్ అగ్ర నటులు, నటీమణుల మాస్టర్ పీస్ సినిమా తెలుగులో..

విజయ్ సేతుపతిలోని విలక్షణతను చాటిన ఈ సినిమా తమిళ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది...

Hello Telugu - Super Deluxe

Super Deluxe : కోలీవుడ్‌లో ఎప్పుడో విడుదలై ఘన విజయం సాధించిన మాస్టర్ పీస్ చిత్రం.. ఇన్నాళ్ల తర్వాత తెలుగులో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమైంది. దైవసెల్వితీర్థం ఫిలిమ్స్ బ్యానర్‌పై దైవసిగమణి, తీర్థమలై, పూల మధు నిర్మాతలుగా త్యాగరాజ కుమార రాజా దర్శకత్వంలో మక్కల్ సెల్వన్ విజయ సేతుపతి, ‘పుష్ప’ ఫేమ్ ఫహద్ ఫాసిల్, సమంత ముఖ్య పాత్రల్లో రమ్యకృష్ణ, మిస్కిన్, గాయత్రి, భగవతి పెరుమాళ్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించిన మాస్టర్ పీస్ చిత్రం ‘సూపర్ డీలక్స్(Super Deluxe)’. ఈ సినిమా తమిళ్‌లో బ్లాక్‌బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడీ మూవీ ఆగస్ట్ 9న తెలుగు‌లో గ్రాండ్ రిలీజ్ సిద్ధమైంది. అప్పట్లో ఈ సినిమా తెలుగులో ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా? అని ఎదురు చూసిన వారెందరో ఉన్నారు. వారందరికీ కోరిక ఈ ఆగస్ట్ 9న నెరవేరబోతోంది.

Super Deluxe Movie Updates

విజయ్ సేతుపతిలోని విలక్షణతను చాటిన ఈ సినిమా తమిళ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. విజయ్ సేతుపతి ఈ సినిమాలో స్పెషల్ లేడీ క్యారెక్టర్ రోల్‌లో నటించారు. ఆయన చేసిన పాత్రకుగానూ ఎన్నో అవార్డ్స్ అందుకున్నారు. ఫహద్ ఫాసిల్, సమంత, రమ్యకృష్ణ పాత్రలు ఈ సినిమాకు మరో ప్రత్యేక ఆకర్షణ. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందించగా పి. ఎస్. వినోద్, నీరవ్ షా డిఓపి గా పని చేశారు. నాలుగు విభిన్న కథలను జోడించి చిత్రీకరించిన ఈ చిత్రం ఎన్నో అవార్డులను, క్రిటిక్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంది. తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన సూపర్ డీలక్స్ సినిమా ఇప్పుడు తెలుగులోనూ ఘన విజయం సాధిస్తుందని మేకర్స్ భావిస్తున్నారు. అందుకే ఈ సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. ఆగస్ట్ 9న టాలీవుడ్‌లో పలు సినిమాలు రిలీజ్‌కు ఉన్నప్పటికీ.. 400కి పైగా థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. మరి ఈ సినిమా టాలీవుడ్‌లో ఎలాంటి రిజల్ట్‌ను సొంతం చేసుకుంటుందో తెలియాలంటే మాత్రం ఆగస్ట్ 9 వరకు ఆగాల్సిందే.

Also Read : Kavya Thapar : ఇస్మార్ట్ లో మిస్ అయ్యా.. డబుల్ ఇస్మార్ట్ బోల్డ్ క్యారెక్టర్ చేశాను

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com