ప్రముఖ సీనియర్ నటుడు అక్కినేని నాగార్జున ప్రత్యేకంగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడును కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు సాదర స్వాగతం పలికారు. ఇద్దరూ చాలా సేపు మాట్లాడుకున్నారు. అనంతరం తన తనయుడు , నటుడు అఖిల్ అక్కినేని పెళ్లి పత్రికను సీఎంకు అందజేశారు. తప్పకుండా రావాలని కోరారు. ఈ సందర్భంగా చంద్రబాబు కచ్చితంగా కుటుంబ సమేతంగా అటెండ్ అవుతామని తెలిపారు.
ఇదిలా ఉండగా ఇప్పటికే ఈ పెళ్లికి సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా వివాహం జరిపించేందుకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. నభూతో నభవిష్యత్ అన్న రీతిలో నిర్వహించాలని నిర్ణయించారు అక్కినేని నాగార్జున. తన మొదటి కొడుకు అక్కినేని నాగ చైతన్య ఇటీవలే నటి శోభిత ధూళిపాళను పెళ్లి చేసుకున్నాడు. అంతకు ముందు తను ప్రముఖ నటి సమంత రుత్ ప్రభుతో జత కట్టినా ఎందుకనో కొంత కాలం పాటు మాత్రమే సఖ్యతగా ఉన్నారు. ఆ తర్వాత విడి పోతున్నట్లు ప్రకటించారు.
తను ప్రస్తుతం సినీ నిర్మాతగా ఉంది. సమంత కూడా వెబ్ సీరీస్ దర్శకుడు రాజ్ నిడిమూరుతో డేటింగ్ చేస్తోందంటూ ప్రచారం జరుగుతోంది. తనకు ఆల్ రెడీ పెళ్లి అయ్యింది. దీనిపై ఇంకా నోరు విప్పలేదు. ఈ సమయంలో అఖిల్ అక్కినేని అనుకోకుండా ముంబైకి చెందిన ముద్దుగుమ్మ ప్రేమలో పడటం, ఇరు ఫ్యామిలీలు పెళ్లికి అంగీకారం తెలపడంతో ఎంగేజ్మెంట్ కూడా పూర్తయింది. ఇప్పుడు పెళ్లికి ఫిక్స్ కావడం ఆహ్వాన పత్రికులు పంచడంలో బిజీగా ఉన్నాడు నాగార్జున. అంతకు ముందు తను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి రావాలని పెళ్లి పత్రిక అందజేశాడు. తను వచ్చాక ఎన్ కన్వెన్షన్ ను కూలగొట్టించాడు.