Stunning Lady- Huma Qureshi :బేబీ దో డై దోలో హుమా ఖురేషీ

సాకిబ్ స‌లీమ్ తో క‌లిసి మూవీలో

Hello Telugu - Stunning Lady- Huma Qureshi

Huma Qureshi : బాలీవుడ్ న‌టి హుమా ఖురేషీ సంచ‌ల‌నంగా మారారు. ప‌లు చిత్రాల‌లో న‌టించి మెప్పించారు. ర‌జ‌నీకాంత్ తో త‌మిళంలో త‌ళుక్కున మెరిశారు. త‌న‌కంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఏర్పాటు చేసుకున్నారు హుమా(Huma Qureshi). వీలు చిక్కితే చాలు షోల‌లో పాల్గొంటూ త‌ళుక్కుమంటున్నారు. ప్ర‌స్తుతం మ‌రోసారి బీ టౌన్ లో హాట్ టాపిక్ గా మారారు. బేబీ దో డై దో చిత్రంలో క‌న్ ఫ‌ర్మ్ అయ్యింది. సికంద‌ర్ ఖేర్ నిర్మాణ సార‌థ్యంలో ఇది రూపొందుతోంది. ఇందులో సాకిబ్ స‌లీమ్ తో జ‌త క‌ట్ట‌నుంది హుమా ఖురేషీ.

Huma Qureshi Got New Film

ఇదిలా ఉండ‌గా సికంద‌ర్ ఖేర్ గ‌తంలో త‌న‌తో క‌లిసి మోనికా , ఓ మై డార్లింగ్ , సాకిబ్ తో సిటాడెల్ , హ‌నీ బ‌న్నీ చిత్రాల‌లో స్క్రీన్ స్పేస్ ను పంచుకున్నారు. తోబుట్టువుల జంట‌తో తిరిగి క‌లిసేందుకు సిద్దంగా ఉన్నానంటూ ప్ర‌క‌టించాడు.

బేబీ దో డై దో న్యూ మూవీకి న‌చికేత్ సమంత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నాడు. ఈ చిత్రంలో సూప‌ర్ స్టార్ చంకీ పాండే కూడా న‌టించ బోతుండ‌డం విశేషం. ఈ మూవీకి సంబంధించి ప్ర‌త్యేక‌త ఏమిటంటే క‌థ న‌చ్చ‌డంతో హుమా , సాకిబ్ నిర్మాత‌లుగా మారారు. సికింద‌ర్ విష‌యానికి వ‌స్తే త‌న స్నేహితుల‌తో ఒక థ్రిల్లింగ్ ప్రాజెక్టులో తిరిగి క‌లుస్తున్నందుకు ఆనందంగా ఉంద‌న్నాడు.

Also Read : Hero Ranveer Singh :త‌నంటే ప్రాణం చ‌చ్చేంత ఇష్టం

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com