Hero Akshay Kumar-Kesari 2 :అక్ష‌య్ కుమార్ కేస‌రి చాప్ట‌ర్ 2 సూప‌ర్

తొలి రోజే క‌లెక్ష‌న్స్ రికార్డ్ బ్రేక్

Hero Akshay Kumar-Kesari 2

Kesari 2 : ఓ వైపు స‌న్నీ డియోల్ , ర‌ణ దీప్ హూడా జాట్ దూసుకు పోతుంటే అక్ష‌య్ కుమార్ అన్నీ తానై న‌టించిన చిత్రం కేస‌రి చాప్ట‌ర్ 2 అంద‌రి అంచ‌నాలు త‌ల‌కిందులు చేస్తూ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. తొలి షో నుంచే బిగ్ టాక్ ను స్వంతం చేసుకుంది. మేజ‌ర్ ఓపెనింగ్ డే రికార్డుల‌ను అధిగ‌మించాడు ఈ మూవీ నుంచి. మొద‌టి రోజు భాక్సాఫీస్ వ‌ద్ద రూ. 7.85 కోట్ల‌తో ప్రారంభ‌మైంది. సి. శంక‌ర‌న్ నాయ‌ర్ పాత్ర‌లో అక్ష‌య్ కుమార్ , నెవిల్లే మెకిన్లీ పాత్ర‌లో త‌మిళ న‌టుడు ఆర్. మాధ‌వ‌న్ న‌టించారు. ఇద్ద‌రూ పోటీ ప‌డి న‌టించ‌డం విశేషం.

Kesari 2 Sensational Collections

ఇదిలా ఉండ‌గా టాలీవుడ్ లో రిలీజ్ అయిన నాని నిర్మించిన కోర్టు రూ. 4 కోట్లు వ‌సూలు చేసింది. కేస‌రి చాప్ట‌ర్ 2(Kesari 2) డ‌బుల్ డిజిట్స్ ను పూర్తి చేయ‌డం విశేషం. ఇదిలా ఉండ‌గా కేస‌రి పేరుతో 2019లో విడుద‌లైంది. బిగ్ స‌క్సెస్ గా నిలిచింది. దీంతో సీక్వెల్ గా చాప్ట‌ర్ 2ను తీసుకు వ‌చ్చారు. కేస‌రి 2 కి 3619 షోస్ ప్ర‌ద‌ర్శించారు. అక్ష‌య్ కుమార్ దేశ భ‌క్తి నిండిన ఉత్సాహంతో న‌టించాడు. గ‌తంలో కేస‌రి మూవీ ప్ర‌పంచ వ్యాప్తంగా మొత్తం రూ. 208.80 కోట్ల‌ను సంపాదించింది.

ఇదిలా ఉండ‌గా ఈ చిత్రాన్ని ఆనాడు రూ. 100 కోట్ల బ‌డ్జెట్ తో నిర్మించారు. ర‌ఘు ప‌లాట్ , పుష్ప ప‌లాట్ రాసిన ది కేస్ ద‌ట్ షుక్ ది ఎంపైర్ పుస్త‌కం ఆధారంగా మూవీని తీశారు. ఇక కేస‌రి 2 ఏప్రిల్ 13, 1919 న జ‌లియ‌న్ వాలా బాగ్ మార‌ణ‌కాండ త‌ర్వాత జ‌రిగిన న్యాయ పోరాటాన్ని అన్వేషిస్తుంది ఈ మూవీ. క‌ర‌ణ్ సింగ్ త్యాగి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. క‌ర‌ణ్ జోమార్ ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ నిర్మించారు.

Also Read : Hero Ajith-Good Bad Ugly :గుడ్ బ్యాడ్ అగ్లీ జోరు వ‌సూళ్ల హోరు

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com