Maranamass : భారతీయ సినిమా కొత్త పుంతలు తొక్కుతోంది. టాలెంట్ ఉన్నోళ్లకు బ్రహ్మరథం పడుతోంది. ప్రధానంగా కంటెంట్ కు ప్రయారిటీ ఇస్తోంది. పూర్తిగా కామెండీ జానర్ ఉంటే చాలు సినిమాలు హిట్ అవుతున్నాయి. ప్రేక్షకులను థియేటర్ల వద్దకు రప్పించేలా చేస్తున్నాయి. ఇక సినిమా విషయానికి వస్తే బాసిల్ జోసెఫ్ డార్క్ కామెడీ మూవీ మరణ మాస్ ఇప్పటికే బ్లాక్ బస్టర్ గా నిలిచింది. థియేటర్లలో దుమ్ము రేపింది. కాసుల వర్షం కురిపించింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కీలక అప్ డేట్ వచ్చింది.
Maranamass Movie in Sony Liv
మరణ మాస్(Maranamass) మూవీ పూర్తిగా కామెడితో నిండి పోయింది. ఇంటిల్లిపాదిని అలరించింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వనుంది. మే 15న సోనీ లివ్ లో స్ట్రీమింగ్ కానుంది. సినిమాను చూడాలని అనుకునే వారికి, మిస్ అయిన వారికి బిగ్ గిఫ్ట్ అని చెప్పక తప్పదు. మరణ మాస్ మూవీలో బాసిల్ జోసెఫ్ , రాజేష్ మాధవన్ కీ రోల్స్ పోషించారు. శివ ప్రసాద్ దర్శకత్వం వహించారు. దీనిని వినోదం, సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందించాడు.
మరణ మాస్ బిగ్ సక్సెస్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు నటుడు బాసిల్ జోసెఫ్. ఇది పూర్తిగా తన హృదయానికి దగ్గరైన సినిమా అని పేర్కొన్నాడు. వైవిధ్య భరితమైన వినోదం, దానికి తోడు అంతు చిక్కని రీతిలో ఉండే పాత్రలు, సంఘటనలు అనూహ్యంగా వెలుగులోకి తీసుకు వచ్చేలా చేస్తాయన్నాడు. ఒక రకంగా మరణ మాస్ అనేది మూవీ కాదు. కేరళ నేపథ్యంలో జరిగిన కథకు దర్పణమే సినిమా అన్నాడు.
Also Read : Hero Nithin Movie :మూడ్ ఆఫ్ తమ్ముడు గూస్ బంప్స్