Single Movie Sensational :సింగిలా మ‌జాకా క‌లెక్ష‌న్స్ ధ‌మాకా

మూడు రోజుల్లో రూ. 16.50 కోట్లు

Single : టాలీవుడ్ ను కామెడీ మూవీస్ కెవ్వుకేక అనిపించేలా దూసుకు పోతున్నాయి. పూర్తిగా వినోద‌పు జాన‌ర్ లో తీస్తున్న సినిమాల‌ను బిగ్ స‌క్సెస్ టాక్ తెచ్చుకుంటున్నాయి. ప్ర‌ధానంగా అస‌భ్య‌త‌కు తావు ఇవ్వ‌కుండా కామెడిని పండించేందుకు ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు ట్రై చేస్తున్నారు. ఇందులో భాగంగా వ‌చ్చిన మ‌రో మూవీ సింగిల్. ఇందులో శ్రీ‌విష్ణుతో పాటు వెన్నెల కిషోర్ న‌వ్వులు పూయించారు. కీ రోల్ పోషించారు. సినిమా బిగ్ స‌క్సెస్ తో దూసుకు పోతోంది. ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సింగిల్ మూడు రోజుల్లోనే రికార్డ్ బ్రేక్ క‌లెక్ష‌న్స్ సాధించింది. రూ. 16.50 కోట్లు వ‌సూలు అయిన‌ట్లు మూవీ మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.

Single Movie Updates

ఇది ఒక ర‌కంగా ఎండ వేడిమి స‌మ‌యంలో కూల్ గా న‌వ్వులు పూయించింది సింగిల్. ప్ర‌ధానంగా చెప్పు కోవాల్సింది క‌మెడియ‌న్ వెన్నెల కిషోర్ గురించి. కార్తీక్ రాజు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు దీనికి. ఈ సినిమాకు మంచి రేటింగ్స్ కూడా ఇచ్చారు సినీ విమ‌ర్శ‌కులు. సింగిల్(Single) అన్ని వ‌ర్గాల‌ను ఆక‌ట్టుకునేలా ఉండ‌డంతో రాబోయే రోజుల్లో మ‌రిన్ని క‌లెక్ష‌న్స్ సాధించ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. మొత్తంగా కామెడీని పండించినందుకు ద‌ర్శ‌కుడిని మెచ్చు కోవాల్సి ఉంటుంది.

క‌థా ప‌రంగా కొంత బ‌లహీనంగా ఉన్న‌ట్టు అనిపిస్తుంది. కానీ కామెడీ ప‌రంగా మాత్రం సూప‌ర్ గా ఉండ‌డంతో ఇంటిల్లిపాది సమ్మ‌ర్ సీజ‌న్ లో చూసేందుకు క్యూ క‌డుతుండ‌డం విశేషం. హీరోయిన్ల కెమిస్ట్రీ అదిరింది. ప్ర‌త్యేకించి వెన్నెల కిషోర్ , న‌టుడు శ్రీ‌విష్ణు పోటీ ప‌డి న‌టించారు. విచిత్రం ఏమిటంటే సింగిల్ ను ఇండియాతో పాటు ఓవ‌ర్సీస్ లో ఎక్కువ‌గా ఆద‌రిస్తుండ‌డంతో మూవీ మేక‌ర్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు.

Also Read : Maranamass Sensational :సోని లివ్ లో మ‌ర‌ణ మాస్ సంద‌డి

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com