Good Bad Ugly : కోలీవుడ్ నటుడు అజిత్ కుమార్, అందాల ముద్దుగుమ్మ త్రిష కృష్ణన్ కలిసి నటించిన చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ దూసుకు పోతోంది. విడుదలైన రోజు తొలి షో నుంచే పాజిటివ్ టాక్ తో ముందుకు వెళుతోంది. దీంతో ఫుల్ ఖుషీగా ఉన్నారు మూవీ మేకర్స్. తన సినీ కెరీర్ లో అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా నిలవడం పక్కా అంటున్నారు సినీ విమర్శకులు. 9వ రోజు ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద డబుల్ సెంచరీ సాధించింది. మరింత విశ్వాసం కలిగించేలా చేసింది.
Good Bad Ugly Movie Trending Collections
ఇదిలా ఉండగా అజిత్ , త్రిష కలిసి నటించిన మరో చిత్రం విదాముయార్చి ఆశించిన మేర ఆడలేదు. కానీ ఇదే కాంబోలో వచ్చిన గుడ్ అండ్ అగ్లీ(Good Bad Ugly) మాత్రం సూపర్ డూపర్ హిట్ అయ్యింది. మంచి టాక్ తో దూసుకు పోతోంది. అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునేలా చేసింది. దీంతో ప్రేక్షకులు థియేటర్ల వద్దకు వస్తుండడం మరింత నమ్మకాన్ని పెంచేలా చేసిందని పేర్కొన్నారు దర్శకుడు. గుడ్ ఫ్రైడే సందర్బంగా గణనీయమైన పెరుగుదల కనిపించింది.
వరల్డ్ వైడ్ గా రూ. 200 కోట్ల క్లబ్ లోకి వెళ్లేందుకు తహ తహ లాడుతోంది ఈ మూవీ. ఇప్పటి వరకు బాక్సాఫీస్ వద్ద రూ. 127.20 కోట్ల నికర లాభాన్ని సాధించింది. పన్నులతో సహా ఇది రూ. 150.09 కోట్ల వసూళ్లతో సమానంగా చూడాల్సి ఉంటుంది. భారతీయ, విదేశీ వసూళ్లను కలిపితే రూ. 205.84 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం.
Also Read : Jaat Huge Collections :జాట్ చిత్రం కలెక్షన్ల వర్షం
