Jagapatibabu : ప్రేమ గొప్ప‌ది స‌ర‌దాగా మారింది

న‌టుడు జ‌గ‌ప‌తి బాబు కామెంట్స్

తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో త‌న‌కంటూ ఓ స్పెష‌ల్ ఇమేజ్ క‌లిగిన న‌టుడు జ‌గ‌ప‌తి బాబు. ప్ర‌స్తుతం ఆయ‌న ప‌లు సినిమాల‌లో బిజీగా ఉన్నారు. ప్ర‌తి నాయ‌కుడిగా రాణిస్తున్నారు. త‌న స‌త్తా ఏమిటో చూపిస్తున్నారు.

జూనియ‌ర్ ఎన్టీఆర్, పూజా హెగ్డేతో త్రివిక్ర‌మ్ తీసిన అర‌వింద స‌మేత చిత్రంలో విల‌న్ గా పండించాడు. మ‌న‌సులో ఏదీ దాచుకోవ‌డానికి ఇష్ట‌ప‌డరు. ఇది ఆయ‌న నైజం. ఉన్న‌ది ఉన్న‌ట్టు చెప్పేస్తారు.

తాజాగా న‌టుడు జ‌గ‌ప‌తి బాబు షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయ‌న ప్రేమ, పెళ్లి గురించి త‌న అభిప్రాయాన్ని నిర్మోహ మాటంగా తెలియ చేశారు. ఇవాళ ప్రేమ అన్న‌ది స‌ర‌దాగా మారింద‌ని అన్నారు. ప్రేమ అన్న‌ది అత్యంత పవిత్ర‌మైన‌ది.

ఇక ప్రేమ‌కు ఇవాళ విలువ లేకుండా పోయింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు న‌టుడు జ‌గ‌ప‌తి బాబు. విచిత్రం ఏమిటంటే అప్పుడే ప్రేమించు కుంటున్నారు. అంత‌లోనే విడాకులు ఇచ్చేసుకుంటున్నార‌ని మండిప‌డ్డారు.

అంతే కాదు విడాకులు ఇచ్చాక పార్టీలు కూడా చేసుకోవ‌డంపై తీవ్ర ఆవేద‌న చెందారు. ఇదేం సంస్కృతి అంటూ మండిప‌డ్డారు న‌టుడు.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com