Kenishaa Francis: జయం రవితో తన రిలేషన్‌ పై సింగర్ కెనీషా వివరణ !

జయం రవితో తన రిలేషన్‌ పై సింగర్ కెనీషా వివరణ !

Hello Telugu - Kenishaa Francis

Kenishaa Francis: కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి… తన భార్య ఆర్తితో విడాకుల విషయం రచ్చకెక్కిన విషయం తెలిసిందే. హీరో జయం రవి తన భార్య నుంచి విడాకులు కోరుతూ కోర్టులో పిటిషన్‌ వేశారు. ప్రముఖ కన్నడ గాయని నీషా ప్రాన్సిస్‌ తో ఉన్న పరిచయం కారణంగానే జయం రవి ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం సాగుతుంది. అయితే, తన నిర్ణయానికి గాయని కెనీషా ఫ్రాన్సిస్‌(Kenishaa Francis) ప్రధాన కారణం కాదని హీరో జయం రవి ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో తాజాగా సింగర్ కెనీషా కూడా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ మధ్య ఉన్న రిలేషన్‌ షిప్‌పై క్లారిటీ ఇచ్చారు.

Kenishaa Francis Comment

ఈ సందర్భంగా కెనీషా మాట్లాడుతూ… హీరో జయం రవి తన భార్య ఆర్తి నుంచి విడాకులు తీసుకోవాలని నిర్ణయం తీసుకోవడం వెనుక తాను కారణం కాదని గాయని కెనీషా ప్రాన్సిస్‌ స్పష్టం చేశారు. ‘‘జయం రవికి నాకు మధ్య ఉన్న సంబంధం శారీరక బంధం కాదు. కేవలం వ్యాపారపరమైన సంబంధం మాత్రమే. జయం రవి నా స్నేహితుడు. నా శ్రేయోభిలాషి మాత్రమే. ఆయన తీసుకున్న విడాకుల నిర్ణయానికి నేను కారణం కాదు. నేనే కారణమంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం. ఆర్తికి విడాకుల నోటీసు పంపించేంత వరకు జయం రవి గురించి పెద్దగా నాకు తెలియదు. పైగా, ఇది నా సమస్య కాదు. ఈ వివాదంలోకి నన్ను లాగొద్దు. అందుకు సమయం కూడా నాకు లేదు’’ అని కెనీషా ఫ్రాన్సిస్‌(Kenishaa Francis) పేర్కొన్నారు.

కాగా, ఇటీవల నటుడు జయం రవి సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. 15 ఏళ్ల వివాహ బంధానికి ఆయన స్వస్తి పలికారు. భార్యతో విడాకులు తీసుకున్నట్లు తెలిపారు. గత కొన్ని రోజులుగా రవి తన భార్య ఆర్తితో విడాకులు తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ విషయాన్ని వివరిస్తూ ఆయన సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టారు. ఇద్దరం ఇష్టపూర్వకంగానే విడాకులు తీసుకుంటున్నట్లు రవి నోట్‌లో తెలిపారు. ‘‘జీవితం ఎన్నో అధ్యాయాలతో నిండిన ప్రయాణం. ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాలి. మీలో చాలామంది నన్ను ఆదరించి నాకు మద్దతుగా నిలిచారు. అందుకే నేనెప్పుడు నా అభిమానులతో పారదర్శకంగా, నిజాయతీగా ఉంటాను. నేడు మీ అందరితో ఓ వ్యక్తిగత విషయాన్ని పంచుకుంటున్నా.

ఈ విషయాన్ని భారమైన హృదయంతో మీకు చెప్పాల్సి వస్తోంది. ఎన్నో ఆలోచనలు, చర్చల తర్వాత నేను, నా భార్య ఆర్తి విడాకులు తీసుకోవాలనే కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నాం. తొందరపాటుతో ఈ నిర్ణయం తీసుకోలేదు. మా ఇద్దరి మంచి కోసమే ఇలా చేస్తున్నాం. మాతో పాటు మా కుటుంబ సభ్యుల గోప్యతను గౌరవించాలని మీ అందరినీ కోరుతున్నాను. ఈ విషయంపై ఆరోపణలు మానేయాలని అందరినీ కోరుతున్నా, ఇది పూర్తిగా మా వ్యక్తిగత విషయం. సినిమాల్లో నటిస్తూనే ఉంటాను. మీ అందరికీ వినోదాన్ని పంచడం కోసం కష్టపడతాను. ఎప్పటికీ మీ జయం రవిగా మీ గుండెల్లో ఉంటా. ఎప్పటికీ ఇలానే సపోర్ట్‌ అందిస్తారని ఆశిస్తున్నా’’ అని జయం రవి పేర్కొన్నారు.

Also Read : Jaya Prada: ప్రభాస్‌ ‘ఫౌజి’ లో ముఖ్యపాత్రలో సీనియర్ నటి జయప్రద ?

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com