ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఒక్క సినిమాతో షేక్ చేశాడు శాండిల్ వుడ్ కు చెందిన దర్శకుడు ప్రశాంత్ నీల్. తన టేకింగ్ భిన్నంగా ఉంటుంది. యశ్ తో తను తీసిన కేజీఎఫ్ ఇప్పటికీ ఓ సెన్సేషన్. ఆ తర్వాత ప్రభాస్ తో సలార్ తీశాడు. అది కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కేజీఎఫ్ సూపర్ సక్సెస్ కావడంతో దానికి సీక్వెల్ తీశాడు. అది కూడా కాసులు కురిపించింది. ఆ తర్వాత ఎవరితో సినిమా తీస్తాడనే ఉత్కంఠకు తెర దించేశాడు నీల్. మాస్ హీరోగా పేరు పొందిన జూనియర్ ఎన్టీఆర్ తో జతకట్టాడు. ఇంకేం తన మేనరిజంకు తగ్గట్టు షూటింగ్ స్టార్ట్ చేశాడు.
దానికి డ్రాగన్ అని పేరు పెట్టాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది ఈ చిత్రం. ప్రస్తుతం కర్ణాటక పరిసర ప్రాంతాలలో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించాడు ప్రశాంత్ నీల్. ఇందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు మాత్రమే బయటకు వచ్చాయి. అవి సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఇక హీరోయిన్ గా ఎవరు నటిస్తారనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు దర్శకుడు ప్రశాంత్ నీల్. తన చిత్రానికి సంబంధించి ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వడు. కేవలం కథనే డామినేట్ చేస్తుంటుంది. ఇది ఆయన స్పెషాలిటీ.
చెప్పాలనుకున్నది సూటిగా చెప్పేందుకు ఎక్కువగా ప్రయత్నం చేస్తాడు. ఇక కేజీఎఫ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ మూవీ దెబ్బకు యశ్ ఏకంగా పాన్ ఇండియా స్టార్ గా మారి పోయాడు. ఇక ఎన్టీఆర్ గురించి చెప్పాల్సిన పనేముంది. తను దర్శకులకు కావాల్సిన హీరో. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన దేవర సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత వస్తున్న మూవీ ఇదే. డ్రాగన్ మూవీకి సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది. రాబిన్ హుడ్ లో స్పెషల్ సాంగ్ తో కెవ్వు కేక అనిపించేలా చేసిన క్రేజీ బ్యూటీ కేతికా శర్మ తారక్ సరసన స్పెషల్ సాంగ్ లో తళుక్కుమన బోతోందని టాక్.