Varun Tej: లాంగ్ గ్యాప్ తరువాత షూటింగ్‌ కు వరుణ్ తేజ్ !

ల్యాంగ్ గ్యాప్ తరువాత షూటింగ్‌ కు వరుణ్ తేజ్ !

Hello Telugu - Varun Tej

Varun Tej: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ అప్ కమింగ్ పాన్-ఇండియన్ మూవీ ‘మట్కా’. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ చిత్రంలో మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి క‌థానాయుక‌లుగా న‌టిస్తోండ‌గా నవీన్ చంద్ర, అజయ్ ఘోష్, కన్నడ కిషోర్, రవీంద్ర విజయ్, పి. రవి శంకర్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. వైరా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డా. విజయేందర్ రెడ్డి తీగల, SRT ఎంటర్టైన్మెంట్స్ రజనీ తాళ్లూరి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు పలాస ఫేం కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.

Varun Tej Movies Update

అయితే గతేడాది తన ప్రియురాలు లావణ్య త్రిపాఠీను పెళ్లి చేసుకున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej)… షూటింగ్ కు విరామం ప్రకటించారు. ఆ తరువాత అప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఆపరేషన్ వాలంటైన్ రిలీజ్ కావడంతో ఆ సినిమా ప్రమోషన్ లో బిజీగా గడిపారు. ఆ సినిమా విడుదలైన తరువాత తన బాబాయ్, జనసేన అధినేత పోటీ చేసిన పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు.

అయితే పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలుపొందడమేకాకుండా డిప్యూటీ సీఎం గా బాధ్యతలు స్వీకరించడంతో గత కొన్ని రోజులుగా ఫ్యామిలీ విజయోత్సవ వేడుకల్లో బిజీగా ఉన్న వరుణ్ తేజ్… ఎట్టకేలకు మళ్ళీ మేకప్ వేసుకోవడానికి సిద్ధమౌతున్నారు. దాదాపు 175 రోజుల తరువాత మట్కా సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. తాజాగా హైదరాబాద్‌ లో ప్రారంభమైన మట్కా మూవీ షూటింగ్ లో పాల్గొన్నాడు. ఈ లెన్తీ 40-రోజుల ముఖ్యమైన షెడ్యూల్ కోసం RFCలో మ్యాసీవ్ సెట్‌ నిర్మించి చాలా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. వరుణ్ తేజ్, నోరా ఫతేహి, మీనాక్షి చౌదరి కూడా ఈ షెడ్యూల్‌ లో పార్ట్ అయినట్లు సమాచారం.

“మట్కా” దేశం అంతటా సెన్సేషన్ క్రియేట్ చేసిన నిజ జీవిత సంఘటనల అధారంగా చేసుకుని ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రంలో వ‌రుణ్‌తేజ్ నాలుగు డిఫరెంట్ అవతార్‌ల‌లో కనిపించ‌నుండ‌డం విశేషం. ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ ఎ. కిషోర్ కుమార్ అందిస్తున్నారు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తున్నారు. ఎడిటింగ్‌ను కార్తీక శ్రీనివాస్ ఆర్ హ్యాండిల్ చేస్తున్నారు.

Also Read : Kaala: రజనీకాంత్ ‘కాలా’ సినిమాకు అరుదైన గౌరవం !

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com