టాలీవుడ్ లో మోస్ట్ పాపులర్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. ఇక హీరోలలో టాప్ లో కొనసాగుతున్న ప్రిన్స్ మహేష్ బాబు దర్శక ధీరుడితో మహేష్ బాబు కలిసి ఉన్న ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.
త్వరలో సినిమా రాబోతోందని జోరుగా ప్రచారం జరుగుతోంది. మహేష్ బాబుతో సినిమా తీస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించాడు దర్శక ధీరుడు.
ఆయన తీసిన ఆర్ఆర్ఆర్ చిత్రం ఆస్కార్ దాకా వెళ్లింది. ఎవరూ ఊహించని రీతిలో నాటు నాటు సాంగ్ కు బెస్ట్ సాంగ్ ఆస్కార్ అవార్డు దక్కింది. ఆ తర్వాత ఎవరితో మూవీ తీస్తాడనే దానిపై ఉత్కంఠకు తెర దించాడు ఎస్ఎస్ రాజమౌళి.
మరో వైపు మహేష్ బాబు మాటల మాంత్రికుడు , దమ్మున్న దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో నటిస్తున్నాడు గుంటూరు కారం చిత్రంలో. శర వేగంగా షూటింగ్ కొనసాగుతోంది. ఈ మూవీలో శ్రీలీల నటిస్తోంది.
వచ్చే ఏడాది సంక్రాంతి రోజున గుంటూరు కారం మూవీని విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు త్రివిక్రమ్, మహేష్ బాబు. ఈ మూవీ అయి పోయాక రాజమౌళితో స్టార్ట్ చేస్తారని టాక్.
