Tiger 3 Box Office : టైగ‌ర్ 3 క‌లెక్ష‌న్ల సునామీ

స‌ల్మాన్ కెరీర్ లో మ‌రో రికార్డ్

Hellotelugu-Tiger 3 Box Office

Tiger 3 Box Office : కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ , అందాల బొమ్మ క‌త్రీనా కైఫ్ క‌లిసి న‌టించిన సీక్వెల్ మూవీ టైగ‌ర్ 3 చిత్రం అంచ‌నాలు మించి ఆడుతోంది. భారీ ఎత్తున ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. ఈనెల 12న‌దీపావ‌ళి పండుగ‌ను పుర‌స్క‌రించుకుని ఈ చిత్రాన్ని మూవీ మేక‌ర్స్ రిలీజ్ చేశారు. అడ్వాన్స్ రూపేణా భారీ డ‌బ్బులు మూట‌గ‌ట్టుకుంది.

Tiger 3 Box Office Records

ఊహించని విధంగా ఏకంగా మూడు రోజుల్లోనే రూ.100 కోట్ల గ్రాస్ క‌లెక్ష‌న్స్ చేసింది. త‌న క్రేజ్ ఏ మాత్రం త‌గ్గ‌లేద‌ని మ‌రోసారి నిరూపించాడు స‌ల్మాన్ ఖాన్. ఈ చిత్రానికి మ‌నీష్ శ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఇండియాతో పాటు వ‌ర‌ల్డ్ వైడ్ గా రిలీజ్ చేశారు టైగ‌ర్ 3ని.

ఇదిలా ఉండ‌గా త‌న సినీ కెరీర్ లో స‌ల్మాన్ ఖాన్ ఏకంగా రూ. 100 కోట్లు వ‌సూలు చేసిన సినిమా టైగ‌ర్ 3(Tiger 3) 17వ చిత్రం కావ‌డం విశేషం. ఈ విష‌యాన్ని మూవీ మేక‌ర్స్ స్వ‌యంగా సామాజిక వేదిక‌గా ప్ర‌క‌టించారు. దీనిని హిందీ, తెలుగు, త‌మిళం భాష‌ల్లో విడుద‌ల చేశారు.

స‌ల్మాన్ ఖాన్ తో పాటు రాణా, అనుప్రియా గోయెంకా, రిద్దీ డోగ్రా, అంగ‌ద్ బేడీ కీల‌క పాత్ర‌ల‌లో న‌టించి మెప్పించారు. య‌శ్ రాజ్ ఫిలిమ్స్ బ్యాన‌ర్ పై దీనిని విడుద‌ల చేశారు.

Also Read : Chari 111 First Look : చారి 111 ఫ‌స్ట్ లుక్ కెవ్వు కేక

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com