Minister Jai Shankar Security Increase :కేంద్ర మంత్రి జై శంక‌ర్ సెక్యూరిటీ పెంపు

సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న కేంద్రం

Minister Jai Shankar Security Increase

Jai Shankar : ఢిల్లీ – కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. బుధ‌వారం కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుబ్ర‌మ‌ణ్యం జై శంక‌ర్ కు ప్ర‌స్తుత ప‌రిస్థితుల దృష్ట్యా సెక్యూరిటీని పెంచుతున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది. ఈ మేర‌కు కీల‌క ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఆయ‌న‌కు ప్ర‌త్యేకంగా బుల్లెట్ ప్రూఫ్ వాహ‌నం కూడా ఏర్పాటు చేశారు. ప్ర‌స్తుతం త‌న‌కు జెడ్ కేట‌గిరీ సెక్యూరిటీ క‌ల్పిస్తున్నారు. అంతే కాకుండా త‌న నివాసం చుట్టూ కూడా భారీ భ‌ద్ర‌త‌ను పెంచారు.

Union Minister Jai Shankar Security Increases

ఇదిలా ఉండ‌గా ప్ర‌స్తుతం భార‌త్, దాయాది పాకిస్తాన్ దేశాల మ‌ధ్య తీవ్ర ఉద్రిక్త‌త‌లు చోటు చేసుకున్నాయి. యుద్ద వాతావ‌ర‌ణం నెల‌కొంది. కేంద్ర మంత్రిగా ప్ర‌స్తుతం సుబ్ర‌మ‌ణ్యం జై శంక‌ర్ కీల‌క పాత్ర పోషిస్తున్నారు. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీకి ఇష్ట‌మైన వ్య‌క్తిగా, త‌న టీంలో ముఖ్య‌మైన మెంబ‌ర్ గా గుర్తింపు పొందారు జై శంక‌ర్(Jai Shankar). ఆయ‌న‌తో పాటు ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా, విదేశాంగ ముఖ్య కార్య‌ద‌ర్శి విక్ర‌మ్ మిస్రీ ఉన్నారు.

అంతే కాకుండా మ‌రొక‌రు అత్యంత న‌మ్మ‌క‌మైన వ్య‌క్తిగా బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్నారు. ఆయ‌న ఎవ‌రో కాదు ఇండియ‌న్ జేమ్స్ బాండ్ గా పేరు పొందిన జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారు అజిత్ దోవ‌ల్.

Also Read : Chief Justice- Gavai Interesting :సీజేఐగా కొలువు తీరిన జ‌స్టిస్ బీఆర్ గ‌వాయి

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com