Natural Star Nani-Hit-3 :రూ. 100 కోట్ల క్ల‌బ్ లోకి నాని హిట్ 3

మూడు రోజుల్లో రికార్డ్ క‌లెక్ష‌న్స్

Natural Star Nani-Hit-3

Hit-3 : శైలేష్ కొల‌ను ద‌ర్శ‌క‌త్వంలో నేచుర‌ల్ స్టార్ నాని, శ్రీ‌నిధి శెట్టి కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన చిత్రం హిట్ 3(Hit-3). ఊహించ‌ని రీతిలో బ్లాక్ బ‌స్ట‌ర్ దిశ‌గా సాగుతోంది. రిలీజ్ అయిన తొలి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ వ‌ద్ద అద్భుత‌మైన వ‌సూళ్లతో విస్తు పోయేలా చేసింది. పూర్తిగా స‌స్పెన్స్, క్రైమ్, థ్రిల్ల‌ర్ గా దీనిని రూపొందించాడు ద‌ర్శ‌కుడు. 2వ రోజున రూ. 40 కోట్లు వ‌సూలు సాధించ‌గా మూడో రోజు రూ. 35 కోట్ల‌కు పైగా వ‌సూలు సాధించి కెవ్వు కేక అనిపించేలా చేసింది.

Natural Star Nani Hit-3 Movie Updates

ఒక్క శ‌నివారం రోజు రూ. 20 కోట్లు క‌లెక్ష‌న్స్ సాధించింది. ప్ర‌పంచ వ్యాప్తంగా రూ. 100 కోట్ల క్ల‌బ్ దగ్గ‌ర‌లోకి చేరుకునే దిశ‌గా నాని హిట్ 3 ప‌రుగులు తీస్తోంది. నిన్న‌టి దాకా నేచుర‌ల్ స్టార్ గా పేరు పొందిన నాని ఫుల్ ప్లెడ్జ్ గా రాక్ స్టార్ గా పేరు పొందాడు. త‌న‌ను డిఫ‌రెంట్ గా తీర్చిదిద్దాడు. ఇటు ఇండియాలోనే కాదు వ‌ర‌ల్డ్ వైడ్ గా వ‌సూళ్ల వేట కొన‌సాగిస్తుండ‌డంతో మూవీ మేక‌ర్స్ ఫుల్ ఫిదా అవుతున్నారు.

ఇప్పటికే రూ. 1.8 మిలియన్లను దాటి, ఎలైట్ రూ. 2 మిలియన్ల క్లబ్‌కు దగ్గరగా ఉంది. హిట్ 3 దసరా , సరిపోదా శనివారంల తర్వాత నాని మూడవ ఎంట్రీని గుర్తు చేస్తుంది. ఆదివారం అడ్వాన్స్‌లు చార్ట్‌లను వెలిగించడంతో బిగ్ క‌లెక్ష‌న్స్ సాధిస్తోంది. హిట్ -3 బిగ్ స‌క్సెస్ టాక్ తెచ్చుకుని క్రైమ్, థ్రిల్ల‌ర్ ల‌ను ప్లే బుక్ ను తిరగ రాస్తోంది. మరోసారి తాను కేవలం స్టార్ కాదని నిరూపించుకున్నాడు. తాను న‌టుడిని కాన‌ని తుఫాన్ బీభ‌త్సం అని నిరూపించాడు.

Also Read : Hero Kamal-Thug Life Talk :మ‌ణిర‌త్నం మార్క్ క‌మ‌ల్ హాస‌న్ స్పార్క్

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com