Nayanthara : నయనతార ఊర మాస్ లుక్ లో నయా సినిమా

ఇందులో నయన్ తల్లి పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది...

Hello Telugu - Nayanthara

Nayanthara : సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార(Nayanthara) పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆమెకు సోషల్ మీడియా వేదికగా సినీ ప్రముఖులు, అభిమానులు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. అలాగే నయన్ కొత్త సినిమాల నుంచి వరుస అప్డేట్స్ వస్తున్నాయి. తాజాగా ఆమె ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేడీ ఓరియెంటెడ్ మూవీని సైతం అధికారికంగా ప్రకటించారు. రక్కయి అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఈ చిత్రానికి కోలీవుడ్ డైరెక్టర్ సెంథిల్ నల్లసామి దర్శకత్వం వహిస్తున్నారు. డ్రమ్ స్టిక్స్ ప్రొడక్షన్స్, మూవీ వర్క్ ఇండియా సంయుక్తంగా ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నాయి.

Nayanthara Movie Updates

ఇందులో నయన్ తల్లి పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. తన కూతురు కోసం చేసే పోరాటమే ఈ మూవీ. అయితే ఈ సినిమాలో నయన్ యాక్టింగ్, పోరాటం ఎంత భయంకరంగా ఉండబోతుందనేది టీజర్ లోనే చూపించారు. పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ తెలుగులోనూ రిలీజ్ కానుంది. తాజాగా విడుదలైన టీజర్ సినిమాపై మరింత ఆసక్తిని కలిగించాయి. టీజర్ లో.. నయన్ ఏడుస్తున్న చిన్న పాపను పడుకొబెట్టి ఆ తర్వాత తన మీదకు దాడికి వస్తున్న వాళ్లపై ఒంటరిగా పోరాటం చేస్తుంది. కర్ర, కత్తి పట్టుకుని చీరలో నయన్ ఊర మాస్ పర్ఫార్మెన్స్ చూస్తుంటే సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. టీజర్ చూస్తుంటే ఇది పూర్తిగా విలేజద్ బ్యాక్ డ్రాప్ లో రానున్న యాక్షన్ డ్రామా అని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ టీజర్ యూట్యూబ్ మంచి వ్యూస్ అందుకుంటుంది.

Also Read : Keerthy Suresh : హీరోయిన్ కీర్తి సురేష్ మ్యారేజ్ ఫిక్స్…గోవాలో పెళ్లా..?

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com