Nayanthara : ‘మహారాజ’ డైరెక్టర్ స్వామినాథన్ డైరెక్షన్ లో నయనతార ‘మహారాణి’ సినిమా

లేడీ ఓరియంటెడ్‌ కథాంశంతో ఈ సినిమా రూపొందించనున్నారు...

Hello Telugu - Nayanthara

Nayanthara : యంగ్‌ డైరెక్టర్‌ నితిలన్‌ స్వామినాథన్ దర్శకత్వంలో సీనియర్‌ నటి నయనతార నటించనున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ఈ చిత్రానికి ‘మహారాణి’అనే టైటిల్‌ ఖరారు చేశారు. ఫ్యాషన్‌ స్టూడియోస్ పతాకంపై సుధన్‌ నిర్మించే ఈ చిత్రంలో నటించేందుకు నయనతార కూడా అంగీకరించి ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే, ఇందులో నటించే నటీనటుల వివరాలను వెల్లడించాల్సి ఉంది.

Nayanthara Movies Update

లేడీ ఓరియంటెడ్‌ కథాంశంతో ఈ సినిమా రూపొందించనున్నారు. కాగా, నితిలన్‌ స్వామినాథన్‌ దర్శకత్వంలో విజయ్‌ సేతుపతి నటించిన ‘మహారాజ’ చిత్రం బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచింది. అతి తక్కువ బడ్జెట్‌తో రూపొందిన చిత్రం ఏకంగా రూ.100 కోట్లకుపైగా వసూలు చేసింది. దీంతో పలువురు స్టార్‌ హీరోలు, దర్శకులు యువ దర్శకుడిని ప్రశంసల వర్షంలో ముంచెత్తారు. ఈ నేపథ్యంలో ఫ్యాషన్‌ స్టూడియోస్‌ తమ తదుపరి చిత్రాన్ని కూడా ఆయన దర్శకత్వంలోనే నిర్మించేందుకు సిద్ధమైంది.

Also Read : Hero Rajinikanth : చెక్ బౌన్స్ కేసులో డైరెక్టర్ లింగ స్వామికి ఫోన్ చేసి సాయం చేసిన తలైవా

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com