Popular Actor Rajendra Prasad :30న న‌ట కిరీటి ష‌ష్టి పూర్తి రిలీజ్

ప్ర‌క‌టించిన మూవీ మేక‌ర్స్

Popular Actor Rajendra Prasad

Rajendra Prasad : మా అయి ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ పై నిర్మించిన చిత్రం షష్టి పూర్తి. దీనికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు ప‌వ‌న్ ప్ర‌భ‌. ఈ సినిమాకు ప్ర‌త్యేక‌త‌లు ఉన్నాయి. ఇందులో చాన్నాళ్ల త‌ర్వాత అంటే 38 ఏళ్ల సుద‌ర్ఘీ గ్యాప్ త‌ర్వాత న‌ట‌కిరీటి రాజేంద్ర ప్ర‌సాద్, వ‌ర్ద‌మాన న‌టి అర్చ‌న క‌లిసి న‌టిస్తున్నారు. ఈ సినిమాకు మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళ‌య‌రాజా సంగీతం అందించాడు. ఈ సినిమాకు సంబంధించి విడుద‌ల చేసిన రెండు పాట‌లు హృద‌యాల‌ను మీటేలా ఉన్నాయి. సంగీత శిఖ‌రం అందించిన మ్యూజిక్ మ్యాజిక్ చేసింది. వింటేజ్ అద్భుతంగా వ‌చ్చింద‌న్న టాక్ వినిపిస్తోంది.

Rajendra Prasad Movie..

ఇందులో పోటీ ప‌డి న‌టించారు మ‌రోసారి రాజేంద్ర ప్ర‌సాద్(Rajendra Prasad), అర్చ‌న‌. వీరితో పాటు రూపేష్, ఆకాంక్ష సింగ్ కీ రోల్స్ పోషించారు. రూపేష్ దీనిని ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించారు. తాజాగా సినిమాకు సంబంధించి కీల‌క అప్ డేట్ వ‌చ్చింది. ష‌ష్టి పూర్తి మూవీని మే 30వ తేదీన ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నం చేస్తామ‌న్నారు ద‌ర్శ‌కుడు పవ‌న్ ప్ర‌భ‌. లేడిస్ టైల‌ర్ విడుద‌లైన సుదీర్ఘ గ్యాప్ త‌ర్వాత క‌లిసి న‌టిస్తుండ‌డంతో అంచ‌నాలు మ‌రింత పెరిగేలా చేశాయి.

ఈ సంద‌ర్బంగా ద‌ర్శ‌కుడు మాట్లాడారు. ఎన్నో ప్ర‌త్యేక‌త‌ల స‌మాహారంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న‌ట్లు తెలిపారు. ఆస్కార్‌ గ్రహీత ఎం.ఎం.కీరవాణి తొలిసారి మేస్ట్రో ఇళయరాజా స్వర సారథ్యంలో పాట పాడటం సినిమాకు ప్రధానాకర్షణలుగా నిలిచాయని స్ప‌ష్టం చేశారు. ఇప్పటికే విడుదల చేసిన రెండు పాటలకు శ్రోతల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తున్నదని, వింటేజ్‌ ఇళయరాజా మ్యూజిక్‌ విన్న ఫీల్‌ ఉందనే ప్రశంసలొస్తున్నాయని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా రామ్ అందించాడు. స్క్రీన్ ప్లే , సంభాష‌ణ‌లు ద‌ర్శ‌కుడు రాశాడు.

Also Read : Hero Vijay Thalapathy :జ‌న నాయ‌గ‌న్ విజ‌య్ ఒత్తిడిలో ఉన్నాడా..?

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com