Peddi : గ్లోబల్ స్టార్ నటిస్తున్న చిత్రం పెద్ది(Peddi). దీనికి దర్శకత్వం వహించారు బుచ్చి బాబు సన. ఇందులో కీలక పాత్రలు పోషించారు బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్, కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్. వీరితో పాటు ప్రముఖ క్రికెటర్ , భారత జట్టు మాజీ స్కిప్పర్ మహేంద్ర సింగ్ ధోనీ కూడా పాలు పంచుకోవడం విశేషం. సమ్మర్ వెకేషన్ కోసం వెళ్లిన రామ్ చరణ్ తిరిగి ఇండియాకు వచ్చాడు. తనకు సంబంధించిన విగ్రహాన్ని ఆవిష్కరించాడు.
Ram Charan Peddi Movie Updates
ఇప్పటి వరకు 30 శాతం షూటింగ్ పూర్తయిందని సమాచారం. దీనిపై ఎక్కువగా ఫోకస్ పెట్టాడు బుచ్చిబాబు సన. ప్రస్తుతం షూటింగ్ లో బిజీగా మారి పోయాడు. రంగస్థలం మూవీలో నటించిన రామ్ చరణ్ ఆ తర్వాత గ్రామీణ నేపథ్యంలో నటిస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. మొదటి గ్లింప్స్ కు భారీ ఎత్తున ఆదరణ లభించింది. ప్రత్యేకించి రామ్ చరణ్ పోస్టర్ కూడా సూపర్ గా ఉంది. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అయ్యారు.
ఈ సందర్బంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు నటుడు రామ్ చరణ్ . తను పూర్తిగా నమ్మకంతో ఉన్నాడు బుచ్చిబాబు సన దర్శకత్వంపై. ఈ ప్రాజెక్టు గురించి గొప్పగా చెప్పాడు. రంగస్థలం కంటే గొప్పగా విజయం సాధిస్తుందని, ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నాడు. ఇప్పటికే సినిమాపై బజ్ పెరగడంతో మార్కెట్ లో హెవీ డిమాండ్ ఉండడం విస్తు పోయేలా చేసింది.
Also Read : Minister Jai Shankar Security Increase :కేంద్ర మంత్రి జై శంకర్ సెక్యూరిటీ పెంపు