Peddi : ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ నటిస్తున్న చిత్రం పెద్దిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. శంకర్ దర్శకత్వం వహించిన గేమ్ ఛేంజర్ మూవీ ఆశించిన మేర ఆడలేదు. నిర్మాత దిల్ రాజుకు కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఆ తర్వాత నటిస్తున్న చిత్రం కావడంతో దీనిపై ఎక్కువగా దృష్టి సారించాడు నటుడు రామ్ చరణ్(Ram Charan). తనకు జోడీగా బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ ను ఎంపిక చేశాడు దర్శకుడు. ఇక మరో కీలక పాత్ర పోషిస్తున్నాడు కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్. ఈ మూవీ కోసం ప్రత్యేకంగా మ్యూజిక్ అందిస్తున్నాడు ఏఆర్ రెహమాన్. తను గేమ్ ఛేంజర్ కు ఆశించిన సాంగ్స్ ఇవ్వలేదనే అపవాదు మూటగట్టుకున్నాడు.
Ram Charan -Peddi Movie Updates
అయితే అందరి దృష్టి ఇప్పుడు పెద్ది(Peddi) పైనే ఉంది. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్ , విడుదల చేసిన గ్లింప్స్ సోషల్ మీడియాను షేక్ చేశాయి. ఓ రేంజ్ లో ఉందంటూ ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ సినిమా పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో ఉంటుందని చెప్పకనే చెప్పాడు బుచ్చిబాబు సన. టేకింగ్ లో , మేకింగ్ లో తనదైన ముద్ర కనబర్చడంలో ఫోకస్ పెడుతుండడంతో సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఇక మెగా ఫ్యాన్స్ అయితే పండుగ చేసుకుంటున్నారు. గ్లోబల్ స్టార్ కు పెద్ది మూవీ ఓ సవాల్ లాంటిదని, ఇందులో ఇరగదీసి నటించడం ఖాయమంటున్నారు.
విచిత్రం ఏమిటంటే ఈ మూవీ షూటింగ్ పూర్తి కాలేదు. అప్పుడే రికార్డులు బద్దలవుతున్నాయి. ఇందులో దేశంలోనే అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన క్రికెటర్ ఎంఎస్ ధోనీ మరో కీ రోల్ లో నటిస్తుండడం సినిమాకు అదనపు బలం చేకూర్చినట్లవుతుందని క్రిటిక్స్ పేర్కొంటున్నారు. ఇప్పటికే మూవీ మేకర్స్ సంచలన ప్రకటన చేశారు. ఆరు నూరైనా అనుకున్న సమయానికి, తేదీకి రిలీజ్ చేస్తామంటూ కుండ బద్దలు కొట్టారు.
వచ్చే ఏడాది 2026 మార్చి 27న ముహూర్తం ఖరారు చేశారు. ఇప్పటికే మ్యూజిక్ రైట్స్ రూ. 25 కోట్లకు టీ సీరీస్ చేజిక్కించుకుందని ట్రేడ్ వర్గాల సమాచారం. ఇక ఓటీటీ రైట్స్ కోసం అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ పోటీ పడుతున్నాయని, ఎంత ధర అయినా సరే పెట్టేందుకు సిద్దంగా ఉన్నాయని సమాచారం.
Also Read : Directors Remuneration Sensational :భారీ పారితోషకం దర్శకుల సంచలనం