Hero Sampoornesh Babu :ఆస‌క్తి రేపుతున్న రైజింగ్ స్టార్ సోద‌రా

ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన మూవీ

Hero Sampoornesh Babu

Sampoornesh Babu : రైజింగ్ స్టార్ సంపూర్ణేశ్ బాబు కీల‌క పాత్ర పోషిస్తున్న సోద‌ర చిత్రం ప్రేక్ష‌కులు ముందుకు వ‌చ్చింది. ఫీల్ గుడ్ క‌లిగించేలా ద‌ర్శ‌కుడు చిత్రీక‌రించాడు. ఈ మూవీలో సంజోష్, ఆర్తి, ప్రాచీ భ‌న్సాల్ ఇత‌ర పాత్ర‌లు పోషించారు. క్యాన్స్ ఎంట‌ర్టైన్మెంట్స్ బ్యాన‌ర్ పై దీనిని నిర్మించారు. క‌థ‌, ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు మ‌న్మోహ‌న్ మేనంప‌ల్లి. సినిమాకు అద్బుత‌మైన సంగీతం అందించారు సునీల్ కాశ్య‌ప్. జాన్ సినిమాటోగ్ర‌ఫీ చేయ‌గా చంద్ర చంగాల నిర్మించారు.

Sampoornesh Babu Movie Updates

శుక్ర‌వారం అధికారికంగా సోదరా చిత్రాన్ని విడుద‌ల చేశారు. గ్రామీణ వాతావ‌ర‌ణం, కుటుంబంలోని బాంధ‌వ్యాల‌ను హైలెట్ చేస్తూ సినిమాను తెర‌కెక్కించే ప్ర‌య‌త్నంచేశాడు ద‌ర్శ‌కుడు. ఇప్ప‌టికే రిలీజ్ చేసిన పోస్ట‌ర్స్, సాంగ్స్ , డైలాగులు కూడా ఆక‌ట్టుకున్నాయి. టాలీవుడ్ లో త‌న‌కంటూ ఓ స్పెష‌ల్ ఇమేజ్ క‌లిగి ఉన్నాడు యంగ్ స్టార్ రైజింగ్ స్టార్ గా పేరు పొందిన సంపూర్ణేశ్ బాబు(Sampoornesh Babu). ఇందులో కీల‌క‌మైన భూమిక పోషించాడు క‌మెడియ‌న్ బాబూ మోహ‌న్.

చాన్నాళ్ల త‌ర్వాత ఆయ‌న సినిమాలో న‌టించ‌డం. అంత‌కు ముందు ప్ర‌జా ప్ర‌తినిధిగా ఉన్నారు. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో పోటీ చేశారు. ఇంటిల్లిపాది క‌లిసి చూసేలా సోద‌రా చిత్రాన్ని తీయ‌డంలో స‌క్సెస్ అయ్యాడు. ఇదే స‌మ‌యంలో అన్న‌ద‌మ్ముల మ‌ధ్య జ‌రిగే సంభాష‌ణ‌లు, న‌ట‌న మూవీకి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిల‌వ‌నుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

Also Read : Beauty Urvashi Rautela :ఊర్వ‌శి రౌతేలా సంచ‌ల‌నం అభిమాన పుర‌స్కారం

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com