Sanam Teri Kasam : బాలీవుడ్ లో రీ రిలీజ్ అయిన సనమ్ తేరీ కసమ్(Sanam Teri Kasam) బీ టౌన్ ను షేక్ చేస్తోంది. సినీ ట్రేడ్ వర్గాలను విస్తు పోయేలా రికార్డ్ స్థాయిలో వసూళ్లను సాధించింది. ఈ చిత్రం 2016లో విడుదలైంది. ఆశించిన మేర ఆకట్టుకోలేదు. తిరిగి 9 సంవత్సరాల తర్వాత తిరిగి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్సాఫీస్ చరిత్రను తిరగ రాస్తోంది. ఏకంగా తొలి రోజే రూ. 5.14 కోట్లను వసూలు చేసింది. తిరిగి విడుదలైన సినిమాలకు సంబంధించిన మూవీస్ లో సనమ్ తేరి కసమ్ టాప్ లో నిలిచింది.
Sanam Teri Kasam Collections
ఈ చిత్రంలో ఎలాంటి స్టార్లు లేరు. దర్శకుడు కొత్త వాళ్లను తీసుకున్నాడు. హర్ష వర్దన్ రాణే, మ్యావ్రా హోకేన్ కలిసి నటించారు. ఈ చిత్రాన్ని పూర్తిగా రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కించాడు. స్టార్టింగ్ లో ఎలాంటి ప్రభావాన్ని చూపించ లేక పోయింది. కానీ తిరిగి రిలీజ్ అయ్యాక మాత్రం ఊహించని రీతిలో కలెక్షన్లను తిరగ రాస్తోంది.
కథ పరంగా చూస్తే బాధ్యతాయుతమైన పెద్ద కూతురు సారు మావ్రా హోకేన్ , తప్పుగా అర్టం చేసుకున్న చెడ్డ అబ్బాయి ఇందర్ (హర్ష వర్దన్ రాణే) మధ్య ఊహించని విధంగా ప్రేమ పుడుతుంది. అది ఎంతమేరకు సక్సెస్ అయ్యిందనేది ఉత్కంఠ భరితంగా చిత్రీకరించాడు.
Also Read : Stunning Lady- Huma Qureshi :బేబీ దో డై దోలో హుమా ఖురేషీ
