Hero Suriya Retro Movie :క‌లెక్ష‌న్ల వేట‌లో సూర్య రెట్రో

కీ రోల్ పోషిస్తున్న పూజా హెగ్డే

Retro : ద‌మ్మున్న డైరెక్ట‌ర్ చేతిలో ప‌డితే సినిమా బిగ్ స‌క్సెస్ అవుతుంద‌ని మ‌రోసారి నిరూపిత‌మైంది రెట్రో మూవీ విష‌యంలో. తాజాగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. గుండెల‌ను హ‌త్తుకునేలా చేసింది. టేకింగ్, మేకింగ్ లో త‌న‌కంటూ ఓ స్పెష‌ల్ ఇమేజ్ క‌లిగి ఉన్న డైరెక్ట‌ర్. రిలీజ్ అయిన తొలి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ వ‌ద్ద హ్యూజ్ క‌లెక్ష‌న్స్ తో హొరెత్తిస్తోంది. ఆశించిన దానికంటే అద్భుతంగా ఆడుతుండ‌డంతో మూవీ మేక‌ర్స్ తెగ సంబ‌ర‌ప‌డి పోతున్నారు.

Suriya Retro Trending Collections

దీంతో న‌టుడు సూర్య అభిమానులు త‌మిళ‌నాట సంబురాల‌లో మునిగి పోయారు. బాణా సంచాలు పేల్చుతున్నారు. పెద్ద ఎత్తున క‌టౌట్ల‌ను ఏర్పాటు చేశారు. చెన్నై, కోయంబ‌త్తూరు, త‌దిత‌ర ప్ర‌ధాన న‌గరాలన్నీ రెట్రో(Retro) పోస్ట‌ర్స్, ఫ్యాన్స్ తో క‌ళ‌క‌ళ లాడుతున్నాయి. థియేట‌ర్లన్నీ ఫుల్ అయ్యాయి. పూజా హెగ్డేను డిఫ‌రెంట్ గా చూపించాడు కార్తీక్ సుబ్బ‌రాజు. త‌ను ఏ సినిమా తీసినా అందులో ఫిమేల్ రోల్స్ కు ఎక్కువ ప్రాధాన్య‌త ఇస్తాడు. ఎలాంటి జుగుస్స, ద్వందర్థాలు లేకుండా, సెక్స్ కు పెద్ద పీట వేయ‌కుండా సినిమాలు తీస్తూ వ‌స్తున్నాడు ద‌ర్శ‌కుడు.

తాజాగా వ‌చ్చిన రెట్రో కూడా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటోంది. అంద‌రి హృద‌యాల‌ను మెలిపెట్టేలా తీశాడు. సూర్య‌, పూజాతో పాటు ఈ చిత్రంలో జ‌య‌రామ్, జోజు జార్జ్, క‌రుణాక‌రన్, ప్ర‌కాశ్ రాజ్, నాస‌ర్ ఇత‌ర పాత్ర‌ల‌లో న‌టించారు. త‌మకు ఇచ్చిన రోల్స్ కు న్యాయం చేశారు.

Also Read : Natural Star Nani-Hit 3 :నాని సంచ‌ల‌నం హిట్ 3 విజ‌యోత్స‌వం

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com