డీజే టిల్లు మూవీతో ఒక్కసారిగా స్టార్ డమ్ స్టేటస్ అందుకున్న నటుడు సిద్దు జొన్నలగడ్డ. తను మంచి నటుడే కాదు అద్బుతమైన మాటకారి కూడా. యూత్ కలల రాకుమారుడిగా మారి పోయాడు. ప్రత్యేకించి అమ్మాయిలకు ఇష్టమైన హీరో ఎవరంటే మా సిద్దు తప్ప ఇంకెవరూ లేరనే స్థాయికి చేరుకున్నాడు.
ఇందుకు కారణం సిద్దు మేనరిజం. డైలాగ్ డెలివరీ మరీ డిఫెరంట్ గా ఉంటుంది. అంతే కాదు తెలంగాణ యాసలో మస్తు మాట్లాడతడు. ఇంకేం తను చేయబోయే సినిమా ఏమిటనే ఉత్కంఠకు తెర దించే ప్రయత్నం చేశాడు ఈ నటుడు.
మంగళవారం ఏకంగా తెలుసు కదా పేరుతో సినిమా పోస్టర్ ను విడుదల చేశారు. ప్రస్తుతం ఇది ట్రెండింగ్ లో కొనసాగుతోంది. ఇందులో సిద్దు జొన్నలగడతో పాటు శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఈ సినిమాను తీస్తోంది. దర్శక, నిర్మాతలకు ఈ సినిమా ఓ ఛాలెంజ్ అని చెప్పక తప్పదు.
విచిత్రం ఏమిటంటే ఈ సినిమాకు దర్శకురాలిగా పరిచయం అవబోతోంది ప్రముఖ స్టైలిష్ డిజైనర్ నీరజ కోన. తన ప్రత్యేకత ఉండేలా జాగ్రత్త పడుతోంది. అన్ని వర్గాలను ఆకట్టుకునేలా, ఇంటిల్లిపాది హాయిగా చూసేలా తెలుసు కదా పేరుతో చిత్రీకరించే ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మొత్తంగా సిద్దు అంటేనే ఓ క్రేజ్. ఈ మూవీలో మరింత రాయల్ గా కనిపిస్తున్నాడు. ఎంతైనా హీరో కదూ.
