మెగా డీఎస్సీ కాదు ద‌గా డీఎస్సీ

ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిలా రెడ్డి

అమ‌రావ‌తి – ఏపీపీసీసీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి ఏపీ స‌ర్కార్ పై మండిప‌డ్డారు. డీఎస్సీ విష‌యంలో ల‌క్ష‌లాది మంది అభ్య‌ర్థులు తీవ్ర ఆందోళ‌న‌లో ఉన్నార‌ని, వారి గురించి మ‌రోసారి ఆలోచించాల‌ని సూచించారు స‌ర్కార్ కు. వారు మాన‌సిక వేద‌న‌లో ఉన్నార‌ని వాపోయారు. రేప‌టి నుంచి ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డం క‌రెక్ట్ కాద‌న్నారు.

నోటిఫికేషన్, పరీక్ష సమయానికి మధ్య 45 రోజులు మాత్రమే గడువు ఇవ్వడం సబబేనా అని ప్రశ్నించారు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి. ఇది మెగా DSC కాదు దగా DSC అని ధ్వ‌జ‌మెత్తారు. కనీసం 90 రోజులు ప్రిపరేషన్ గడువు ఉండాలని పేర్కొన్నారు. 45 రోజుల్లో సిలబస్ మొత్తం చదవలేమని చెబుతున్నా ప‌ట్టించుకోక పోవ‌డం ప‌ట్ల మండిప‌డ్డారు.

మూడున్నర లక్షల మంది DSC అభ్యర్థుల పట్ల కనికరం చూపాలని లేఖల మీద లేఖలు మీకు రాస్తుంటే,
కనికరించక పోవడం ప‌ట్ల మండిప‌డ్డారు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి. నిరుద్యోగుల మొరను పెడచెవిన పెట్టడం అంటే. కూటమి ప్రభుత్వ నియంత పోకడకు నిదర్శనం అన్నారు. పైగా డీఎస్సీ వాయిదా వేయాలని చూసే రాజకీయ కుట్రగా మీరు మాట్లాడటం దారుణ‌మ‌న్నారు. మీ తొందర పాటు నిర్ణయానికి అద్ధం పడుతుందన్నారు. డీఎస్సీ నిర్వహణలో పరీక్ష రాసే అభ్యర్థుల డిమాండ్లను పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. 90 పాఠ్య పుస్తకాలను 45 రోజుల్లో ఎలా చదవగలరో అర్థం చేసుకోవాలన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com