యంగ్ హీరో విజయ్ దేవరకొండ, లవ్లీ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే కలిసి నటించిన చిత్రం కింగ్ డమ్. వాస్తవానికి ఈ నెలలోనే రిలీజ్ కావాల్సి ఉంది. అయితే దర్శకుడు తిన్నసూరి సినిమాను పూర్తి చేసినా ఎందుకనో సంతృప్తిగా లేనట్టు సమాచారం. దీంతో తిరిగి కొన్ని సన్నివేశాలను చిత్రీకరించేందుకు రెడీ అయ్యాడని టాక్. ఇప్పటికే కింగ్ డమ్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. విడుదల చేసిన టీజర్ కెవ్వు కేక అనిపించేలా ఉంది. అంతే కాకుండా లవ్ సాంగ్ కూడా ఆకట్టుకుంది. ఫీల్ గుడ్ ఉన్న మూవీగా ఉంటుందని ఇప్పటికే ప్రకటించారు మూవీ మేకర్స్.
ఇక దర్శకుడి టాలెంట్ టేకింగ్, మేకింగ్ లో కనిపించడం ఖాయం. కింగ్ డమ్ లోని కీలక సన్నివేశాలను ఇండియాతో పాటు శ్రీలంకలో చిత్రీకరించారు. గతంలో ఎన్నడూ లేని రీతిలో విజయ్ దేవరకొండను కింగ్ డమ్ లో చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ముందుగా ప్రకటించిన తేదీ కాకుండా వచ్చే జూలై నెలలో కింగ్ డమ్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని డిసైడ్ అయ్యారు.
విచిత్రం ఏమిటంటే అదే నెలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరి హర వీరమల్లు చిత్రం రిలీజ్ కానుంది. వాస్తవానికి ఈ సినిమా పడుతూ లేస్తూ వచ్చింది. జూన్ 12న రిలీజ్ చేస్తామని ఆర్భాటంగా ప్రకటించారు నిర్మాత ఎంఎం రత్నం. కానీ దర్శకుడు మారడం, పవన్ కళ్యాణ్ తాను తీసుకున్న పారితోషకం రూ. 11 కోట్లను తిరిగి ఇచ్చేయడం ఒకింత విస్తు పోయేలా చేసింది. ఈ సినిమాను జూలై 4న రిలీజ్ చేయాలని తాత్కాలికంగా నిర్ణయం తీసుకున్నట్లు టాక్. మరి ఆరోజు కూడా వస్తుందా లేదా అని పవన్ ఫ్యాన్స్ ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.
అయితే విజయ్ దేవరకొండ చిత్రం కింగ్ డమ్ కూడా జూలై 4న రాబోతోందని, పవన్ సినిమా అదే రోజు రిలీజ్ చేస్తే ఏమిటనే ప్రశ్న ఎదురవుతోంది. మొత్తంగా రౌడీ వర్సెస్ పవర్ స్టార్ కాబోతోందన్నమాట