Vijay Thalapathy : యావత్ దేశమంతా ఉత్కంఠతో ఎదురు చూస్తోంది తమిళ సినీ సూపర్ స్టార్ దళపతి విజయ్(Vijay Thalapathy). ఎవరూ ఊహించని రీతిలో తను టీవీకే పేరుతో రాజకీయ పార్టీని ఏర్పాటు చేశాడు. దేశ చరిత్రలో ఒక ప్రాంతీయ కొత్త పార్టీ ఏర్పాటు సమావేశానికి 10 లక్షల మందికి పైగా హాజరు కావడం. ఇదే సమయంలో తను సినీ కెరీర్ కు పుల్ స్టాప్ పెడుతున్నట్లు అశేష జనవాహినిని ఉద్దేశించి ప్రకటించాడు. ఇది కలకలం రేపింది. తను ఒక్క మూవీలో నటించేందుకు రూ. 150 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటాడని టాక్. కోలీవుడ్ లో రజనీకాంత్ తో సరిపడా ఇమేజ్ కలిగి ఉన్న నటుడిగా గుర్తింపు పొందాడు.
Vijay Thalapathy…
తనకంటూ స్పెషల్ గా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వీరు కోట్లల్లో ఉంటారని సమాచారం. తన ఒక్క మూవీ రిలీజ్ అయ్యితే చాలు నిర్మాత ప్రశాంతంగా నిద్ర పోవచ్చు. ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉంటూనే మరో వైపు పార్టీని బలోపేతం చేయడంపై ఫోకస్ పెట్టాడు దళపతి విజయ్(Vijay Thalapathy). ఇదే సమయంలో తను నటిస్తున్న తాజాగా చిత్రం జన నాయగన్ (జన నాయకుడు) పై ఎక్కువగా ఫోకస్ పెట్టాడు. దీనిని సాధ్యమైనంత త్వరలో పూర్తి చేయాలని అనుకుంటున్నాడు. ఆ దిశగా షూటింగ్ కూడా శరవేగంగా కొనసాగుతోంది. అయితే తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.
కోట్లాది మంది అభిమానులు ఈ మూవీపై గంపెడు ఆశతో ఉన్నారు. తమ అభిమాన నటుడు నటించే చివరి చిత్రం తమ అంచనాలకు మించి ఉండాలని భావిస్తున్నారు. దీంతో అటు నటుడితో పాటు ఇటు దర్శకుడు సైతం తీవ్ర ఒత్తిళ్లకు గురవుతున్నారు. ఏ మాత్రం తేడా వచ్చినా అది తన సినీ రంగాన్నే కాదు రాజకీయ రంగంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. అందుకే ఒళ్లు దగ్గర పెట్టుకుని నటిస్తున్నట్లు వినికిడి. ఇదిలా ఉండగా తళపతితో విజయ్ తో సినిమాలు తీసేందుకు పలువురు దర్శకులు తనతో డిస్కస్ చేశారని కానీ చివరకు తమిళ దర్శకుడితోనే ఆఖరు చిత్రానికి కమిట్ అయ్యాడు. గోపిచంద్ మలినేని కూడా తనకు కథ చెప్పాడని, దీనికి ఓకే చెప్పినా తమిళ నిర్మాతలు ఒప్పుకోలేదని సమాచారం.
Also Read : Hero Shah Rukh Khan Daughter : షారుక్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ సూపర్